చిత్రం:ధర్మదాత(1970)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం:కొసరాజు
గానం: ఘంటసాల
ఎవ్వడికోసం ఎవడున్నాడు
పొండిరా పొండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి
ఉన్నవాడిదే రాజ్యమురా
లేనివాడి పని పూజ్యమురా
మనుషులలోన మమతలు లేవు
మంచిత నానికి రోజులు కావు
అంతా స్వార్థం జగమంతా స్వార్థం
ఒకడికి నే తలవంచనురా
బానిసగా జీవించనురా
మిన్ను విరిగి పైబడినా కాని
అవమానాన్ని సహించనురా
ఒరేయ్... ఉంటే వేళకు తింటా
లేకుంటే పస్తులు ఉంటా...
కాలం మారకపోతుందా
కష్టం తీరకపోతుందా
అదృష్టమన్నది ఇంటికి వచ్చి
తలుపులు తట్టకపోతుందా
అప్పుడు మీరేమంటారు
మా నాన్నే... మా నాన్నే...
మా బాబే... అంటూ
నీడకు చేరే పక్షుల్లాగా...
బెల్లం చుట్టూ ఈగల్లాగా
మూగకపోరూ నే చూడకపోనూ
0 Comments