చిత్రం: హ్యాపీ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్. పి. బి. చరణ్
Happy
Banner: Geetha Arts
Screenplay & Director: A. Karunakaran
Producer: Allu Aravind
Directed by A. Karunakaran
Produced by Allu Aravind
Written by Kona Venkat
Starring Allu Arjun, Genelia D'Souza,Manoj Bajpai,Brahmanandam,Venu Madhav,Tanikella Bharani,Suman Setty,Rahul Aggarwal,Rama PrabhaSeetha,Apoorva, Jahnavi
Music by Yuvan Shankar Raja
Lyrics: 'Sirivennela' Seetharama Sastry, Chandrabose, Kulasekhar, Vishwa, Pothula Ravi Kiran, Anant Sreeram
Release date(s) 27 January 2006
పల్లవి:
ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో..
ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా
ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ
ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే...
ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో (2)
చరణం: 1
నిదరోయే నీ కనులు యదలోన ఆ కలలు
ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా
నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ
చరణం: 2
ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు
ఇపుడైనా ఇకనైనా నీ పంతమాగేనా
అన్నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమే చేసినా
పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా
నీ తోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు
నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమా
ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)
ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా
ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ
ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే...
ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)
0 Comments